నారింజ బ్యారేజ్ ను సందర్శించిన ఇరిగేషన్ అధికారులు
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం జహీరాబాద్, జూలై 2:జహీరాబాద్ మండలం కొత్తూరు (బి ) గ్రామం లోని నారింజ బ్యారేజ్ ను జహీరాబాద్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సి విజయ్ కుమార్ సందర్శించారు. నారింజ బ్యారేజ్ మూడవ గేట్ ను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని, అదేవిధంగా వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని జనరేటర్ సజావుగా నడిచే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోను రెండు గేట్ లను ఆపరేట్ చేయాల్సిందేనని నొక్కి చెప్పారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంట డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లు జ్యోత్స్న, జనార్దన్ రావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లు పాండు, స్టాలిన్, వర్క్ ఇన్స్పెక్టర్ రఘు, మ్యాన్ మజ్దూర్ మహబూబ్ అలీ, లష్కర్లు పాండు, చోటు, షౌకత్ అలీ లు ఉన్నారు