జూలై 10న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ కు పిలుపు నిచ్చిన విద్యార్థి సంఘాలు

July 5, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ 05 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్’కు సంబంధించిన పోస్టర్‌ ఆవిష్కరణ అద్దె భవనాలల్లో నడుస్తున్న పాఠశాలలు హాస్టల్స్ మరియు గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి విద్య అందరి హక్కు అది వ్యాపారం కాదు అనే ఏకైక నినాదంతో ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తనగా ఉన్న విద్య సంవత్సలలో విద్యార్థులు ఎదుర్కొంటున అనేక విద్యారంగ సమస్యల పరిష్కారాన్ని కాంక్షిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈనెల జూలై 10న చేపట్టబోయే రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ పోస్టర్‌ను శనివారం షాద్నగర్ నియోజకవర్గలోని స్థానిక డా బి ఆర్ అంబేద్కర్ చౌరస్తా ముఖ్య కూడలి ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులతో ఆయన పోస్టర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా ఏ ఐ ఎస్ ఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్ మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. జూలై 10న జరగబోయే విద్యాసంస్థల బంద్‌ను విద్యాసంస్థల యాజమాన్యాలు ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. మరి అలాగే ప్రభుత్వా నిబంధనలు పాటించని పాఠశాల గుర్తింపులను రద్దు చేయాలని ఆయన కోరారు ప్రవేట్ విద్యా సంస్థ లు ఫీజుల దోపిడీని అరికట్టాలి విద్యాసంస్థల్లో ఇష్టారాజ్యంగా పెంచిన ఫీజుల కారణంగా చాలా మంది విద్యార్థుల విద్యకు దూరమయ్యే పరిస్థితులు ఆగుప్పిస్తున్నాయి బి-కేటగిరి సీట్లను పారదర్శకంగా కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే భర్తీ చేయాలి ప్రభుత్వ యూనివర్సిటీలను కాపాడాలి విద్యను అందరికీ అందుబాటులో ఉండేలా ప్రజల హక్కుగా మార్చాలి. విద్యారంగంలో పేరుకుపోయిన సమస్యలను ప్రభుత్వం తక్షణమే స్పందించి. పరిష్కరించాలి.విద్య అందరి హక్కు వ్యాపారం కాదు అనే ఏకైక నినాదంతో విద్యా రంగాన్ని కాపాడుకోవడానికి ఈ పోరాటం చేస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. ఖాళీగా ఉన్న టీచర్ ఎంఈఓ డిఇఓ మరియు లెక్చరర్స్ పోస్టులను భర్తీ చేయాలి. స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి జీవో నెంబర్ 7 8 9 రద్దు చేయాలి. ఎన్ ఈ పి 20-20 తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలి . కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేసి ఐదు లక్షల విద్య భరోసా కార్డులు ఉచిత ల్యాప్టాప్ లు అందించాలి. అద్దె భవనాలల్లో నడుస్తున్న పాఠశాలలు హాస్టల్స్ గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి. ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసి తక్షణమే ప్రారంభించి నిధులు కేటాయించాలి విద్య హక్కు చట్టం అమలు చేసి పేద విద్యార్థులకు 25% ఉచిత ప్రవేశాలు కల్పించాలి. రాష్ట్రంలో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలి. అని ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎస్ ఫ్ స్థానిక నాయకులు శ్రీను నాయక్ విజయ్ రాహుల్ సిద్ధూ అకేష్ రాజేష్ మహేష్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper