బిజెపి మండల కార్యవర్గ సమావేశం

July 5, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూలై 5 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ గ్రామీణ మండల కార్యవర్గ సమావేశం అనాతవరం గ్రామంలో జరిగింది. మండల అధ్యక్షురాలు చప్పిడి శ్రీదుర్గ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు.వికసిత భారత్ సంకల్ప యాత్ర, ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ, డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలపై సమావేశంలో చర్చించారు. మండల అసెంబ్లీ సమన్వయకర్త, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు గోలకోటి వెంకట రెడ్డి, మండల ఇంచార్జి గనిశెట్టి వెంకటేశ్వరావు, రాష్ట్ర మండలి సభ్యుడు పి వి వి ఎస్ ఎన్ మూర్తి రాజు, నీటి సంఘం డైరెక్టర్, వికసిత భారత్ సంకల్ప యాత్ర జిల్లా సహ సమన్వయకర్త పి వి వి సత్యనారాయణ రాజు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఉపాధి హామీ పథకంలో వచ్చిన మార్పులను వివరించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి జె కె వి ఆర్ సత్తిబాబు, మండల ఉపాధ్యక్షుడు వి నాగేశ్వరరమణ, మహిళా మోర్చా అధ్యక్షురాలు కొప్పిశెట్టి లావణ్య, మహిళా మోర్చా కార్యదర్శి మట్టపర్తి శకుంతల దేవి, సఖిలే ఆశ, కార్యకర్తలు, ఉపాధి హామీ పథక లబ్దిదారులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper