మహిళా, శిశు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత

August 26, 2026 | వైరల్ వార్తలు

11 మంది అంగన్వాడీ హెల్పర్లకు నియామక పత్రాలు అందజేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్


జనం న్యూస్ ఆగస్టు 26 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ)అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్లకు యూనిఫామ్‌ల పంపిణీ రామచంద్రపురం: అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు మెరుగైన పౌష్టికాహారం అందించడంతో పాటు నాణ్యమైన విద్య, ఆరోగ్య పరిరక్షణ సేవలు అందించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు.రామచంద్రపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న 11 అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు కొత్తగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను మంత్రి వాసంశెట్టి సుభాష్ మంగళవారం తన చేతుల మీదుగా అందజేశారు. ఇందులో రామచంద్రపురం మండలానికి చెందిన 3 మంది, కె.గంగవరం మండలానికి చెందిన 8 మంది ఉన్నారు.ఈ సందర్భంగా అంగన్వాడీ వ్యవస్థలో పనిచేస్తున్న సిబ్బందిని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా 183 మంది అంగన్వాడీ వర్కర్స్, 179 మంది అంగన్వాడీ హెల్పర్స్‌కు యూనిఫామ్‌లను మంత్రి సుభాష్ అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారుల భవిష్యత్తుకు పునాది వేస్తున్న కీలక కేంద్రాలని అన్నారు. చిన్నారులకు ప్రతిరోజూ అందించే పౌష్టికాహారం నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారి ఆరోగ్యం, పరిశుభ్రత, విద్యా ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే ప్రతి చిన్నారికి ఆప్యాయతతో కూడిన వాతావరణం కల్పించి, ఆటపాటలతో కూడిన విద్య ద్వారా వారి మేధో వికాసానికి తోడ్పడాలని తెలిపారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కోరారు.ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు, పారిశుధ్యం, విద్యా వాతావరణం మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. అంగన్వాడీ సిబ్బంది తమ బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తించి ప్రభుత్వ లక్ష్యాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ వి. వి.వరహాలక్ష్మి, సూపర్ వైజర్స్ కె నాగమణి, కళ్యాణి, పార్వతి, అలాగే అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు దుర్గాదేవి, వర్కర్స్, హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper