శ్రీ వెంకటేశ్వర మెకానిక్ గ్యారేజ్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే సిందే
బిచ్కుంద జూలై 5 జనం న్యూస్ :కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర మెకానిక్ గ్యారేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గ్యారేజ్‌ను ప్రారంభించి యజమానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “నిజాయితీ, నాణ్యమైన సేవలతో వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించి, ఈ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయడం అభినందనీయమని” అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, వ్యాపారవేత్తలు, అభిమానులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్యారేజ్ యజమానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
