పార్టీ సీనియర్ నేతలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే
బిచ్కుంద జూలై 5 జనం న్యూస్బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులను మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే స్వయంగా వారి నివాసాలకు వెళ్లి పరామర్శించారు. కందర్ పల్లి గ్రామానికి చెందిన సీనియర్ కార్యకర్త రాములు – ఇటీవల వెన్నుపూస సర్జరీ చేయించుకున్నారు. అప్పారావు పటేల్ కాలి బోటనవెలికి సర్జరీ చేయించుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు.పార్టీ కోసం వారు చేస్తున్న సేవలను గుర్తుచేసుకున్నారు. త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు. పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ శామల గంగాధర్, పార్టీ నాయకులు మాజీ జడ్పిటిసి రాజు, సొసైటీ వైస్ చైర్మన్ యాదవ్ రావ్, వెంకట్రావు దేశాయ్, సంజూ పటేల్, బస్వరాజ్ పటేల్, పుల్లూర్ రాజు పటేల్, మాత్యుల్వార్ మారుతి మరియు ఇతర కార్యకర్తలు.