చెయ్యేరులో ఘనంగా జననేత వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి వేడుకలు- రంగా విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాలతో నివాళులు అర్పించిన కాపు సంఘం నాయకులు

July 5, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూలై 5 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం చెయ్యేరు లో ఘనంగా నిర్వహించిన వంగవీటి జయంతి వేడుకలు. పేద ప్రజల గుండెచప్పుడు నవ యువ సమాజ మార్గదర్శి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి విజయవాడ మాజీ శాసనసభ్యులు ప్రజా సేవకుడు జననేత వంగవీటి మోహన్ రంగా 79వ జయంతిని పురస్కరించుకుని మండలం పరిధిలోని చెయ్యేరు గ్రామంలో శనివారం నాడు కాపు సంఘం. రంగా రాధా మిత్ర మండలి ఆధ్వర్యంలో రంగా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు గ్రామంలో జెల్లగుంట వద్దనున్న రంగా విగ్రహానికి కాపు సంఘం నాయకులు. అభిమానులు పూలమాలలు వేసి పుష్పాలతో ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పేద ప్రజల ఇళ్ల పట్టాల కోసం ప్రజా పోరాటం చేస్తూ తన ప్రాణాలను అర్పించిన మహానాయకుడు వంగవీటి మోహన్ రంగా అని పలువురు కొనియాడారు ఆయన మన మధ్య లేకపోయినా జనం గుండెల్లో స్థిరస్థాయిగా జీవించే ఉన్నారన్నారు రంగా ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గ కాపునాడు కన్వీనర్ మరియు బిజెపి నాయకులు నంద్యాల వెంకటరెడ్డి (చంటి) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సూదా సత్తిబాబు, సూదా దొరబాబు, జనసేన నాయకులు కాయల బలరాం, అడపా రాము, నంద్యాల శివాజీ, నంద్యాల మోహన్, పోలిశెట్టి వీరబాబు, తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper