కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి
జనం న్యూస్, జూలై 05,అచ్యుతాపురం :అచ్యుతాపురం మండలం సీఐటీయూ సమన్వయ కమిటీ సమావేశం మండల కన్వీనర్ కే. సోమునాయుడు అధ్యక్షతన జరిగింది .ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శంకర్, కార్యదర్శి ఆర్. రాము మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల్లో ధరల పెరుగుదలకు అనుగుణంగా కార్మికుల కనీసం వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ప్రతి ఐదు సంవత్సరాలకి వేతన సవరణ చేయాలని ఉన్నా 2007 నుండి కాంగ్రెస్ ,టిడిపి, వైసిపి, నేటి కూటమి ప్రభుత్వాలు కార్మికుల వేతనాలు పెంచలేదని,సుప్రీంకోర్టు కార్మికులకు కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలని చెప్పినా నేటికీ అమలు చేయడం లేదని,కర్ణాటకలో 60 శాతం తెలంగాణ రాష్ట్రం నోయిడా ప్రాంతాల్లో వేతనాలు పెంచారని, మన ప్రాంతంలో ఉన్న బ్రాండిక్స్, ఫార్మా, ఫెర్రో ఎల్లయిస్ ఇతర పరిశ్రమలలో ఆశా,అంగన్వాడి, మధ్యాహ్నం భోజనం పథకం, వివోఏ ,వీఆర్ఏ ,పంచాయతీ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు వేతనాలు పెంచేంతవరకు పోరాటాలు నిర్వహించాలని కోరారు .ఈ కార్యక్రమంలో ఎస్ఈ జెడ్ కార్మికులు ఎల్ నర్సింగరావు, సత్యనారాయణ ,అంగనవాడి యూనియన్ నాయకులు నారాయణమ్మ, ఆశా నాయకులు మంగమ్మ ,దుర్గ, మిడ్డే మిల్ నాయకులు సత్యవతి, వివో ఏ నాయకులు దేవుడమ్మ తదితరులు పాల్గొన్నారు.