బెల్లంకొండ రిసెప్షన్లో ప్రత్యేక ఆకర్షణగా కాజల్….
జనం నేవ్స్నేవ్స్: రీసెంట్ గా ఒక ఇంటివాడైన బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ రిసెప్షన్ నిన్న రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. సినీ ఇండస్ట్రీ పెద్దలు హాజరయిన ఈ వేడుకకు బెల్లంకొండ తో గతంలో జతకట్టిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా తన భర్తతో కలిసి హాజరయ్యారు. చూపరులను ఆకర్షించేలా లెహంగా స్టైల్ సారీ లో ఎలిగెంట్ గా కనిపించిన కాజల్ ఈ వేడుకలో సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా మారారు. దాంతో ఆ వేడుకలో ఆమె ఫోటోలు, వీడియాలు ఇప్పుడు ఆన్లైన్ లో వైరల్ గా మారాయి. మీరు కూడా వాటి మీద ఒక లుక్కెయ్యండి… వైరల్ గా మారిన ఈ ఫోటోలను ఆన్లైన్ లో చూసిన అభిమానులు తమ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. చందమామతో పోలుస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజంగా అప్పుడే కాజల్ ఇండస్ట్రీ లో కాలుపెట్టి 20 ఏళ్ళు కావొస్తుందా? అసలు ఆమెను చూస్తే ఆ ఫీలింగ్ రావడం లేదు అంటూ ఆమె ఫోటోలకు లైకులు కొడుతున్నారు. పెళ్లి తరువాత కూడా సినిమాలతో బిజీ బిజీగా ఉన్న కాజల్ ప్రస్తుతం NBK 111 లో హీరోయిన్ పాత్రను పోషినబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముందుగా ఈ సినిమాకోసం నయనతారను హీరోయిన్ గా తీసుకున్నప్పటికీ ఆమె డేట్ ల విషయంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆమె ప్లేస్ లో కాజల్ ను తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఇది అఫిషియల్ న్యూస్ కాదు. గతంలో బాలయ్యతో కాజల్ భగవంత్ కేసరి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈమె లీడ్ రోల్ లో చేసిన ఇండియా స్టోరీ జులై 24 తెలుగు తమిళ హిందీ భాషల్లో విడుదల కానుంది.