ఉపముఖ్యమంత్రి రాక ఇద్దరి మరణాలు.

July 16, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ 16 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ సింధనూర్ ఉప్పరి గంగాధర్ మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం మేడికొండ ఆర్ బి రోడ్డు గత 2009. సంవత్సరం నుండి ఇప్పటివరకు ముగురు ఎమ్మెల్యేలు మారారు అయినా ఇప్పటివరకు ఈ ఆర్ &బి రోడ్డు దుస్థితి ఇంతవరకు మారలేదు ఇప్పటివరకు ఎన్నో మరణాలు సంభవించాయి అయినా ప్రభుత్వానికి కొంతైనా కనికరం లేకపోయింది ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఆర్ బి రోడ్డు పనులు మొదలు పెడతారు ఇది గ్రామాలకు వెళ్లే రహదారి కాదు అంతర్ రాష్ట్ర రహదారి ప్రతి సంవత్సరం కొన్ని వందల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఆ దారి గుండా పోయే ప్రతి రైతు ఇబ్బందులకు గురవుతున్నారు అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామాలలోకి ఎమర్జెన్సీ కొరకు అంబులెన్స్ రావాలన్న గంటలకోది సమయం పడుతుంది ఈ గ్రామాలకు విముక్తి ఎప్పుడు అంటు న్న జోగులాంబ గద్వాల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింధనూర్ ఉప్పరి గంగాధర్ అదేవిధంగా స్కూల్ విద్యార్థులకు అంతర్ రాష్ట్ర ప్రయాణికులకు ఇదే దుస్థితి కలుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంతైనా సోయ ఉంటే ఈ పనులు వెంటనే మొదలుపెడతారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అయిజ మండల ప్రధాన కార్యదర్శి జుంజు కృష్ణ సింధనూర్ బసవ స్వామి రాజాపురం సురేంద్ర గౌడ్ వి కృష్ణ టి హనుమంతు కె రమేష్ కె రామకృష్ణమ కె నరసింహులు డి సంజన మ టి ఎస్ రంగన్న టి రాముడు బి జే ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper