సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు

July 16, 2026 | తెలంగాణ

జనం న్యూస్, జులై 16, జగిత్యాల జిల్లా, కోరుట్ల నియోజకవర్గం: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రత్యర్థులు, రైతులను ఉద్దేశించి హింసను ప్రేరేపించేలా, ప్రజల్లో ఉద్రిక్తతలు సృష్టించేలా ఉన్నాయని ఆరోపిస్తూ, ఆయనపై భారతీయ న్యాయ సంహిత (BNS), 2023లోని సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు గురువారం కోరుట్ల, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ పోలీస్ స్టేషన్లలో పోలీసు అధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదులు సమర్పించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆదర్శంగా ఉండేలా బాధ్యతాయుతమైన వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. హింసను ప్రేరేపించేలా లేదా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.ఇలాంటి వ్యాఖ్యల వల్ల సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన నాయకులు, ఈ అంశాన్ని పోలీసులు అత్యంత ప్రాధాన్యతతో పరిగణించాలని కోరారు.తాము సమర్పించిన ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించి, భారతీయ న్యాయ సంహిత (BNS), 2023లోని సంబంధిత సెక్షన్ల ప్రకారం తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు విజ్ఞప్తి చేశారు.

🌐 Select Language:
📰 ePaper