షబ్బీర్ అలీని కలిసిన కాంగ్రెస్ నాయకులు

July 20, 2026 | తెలంగాణ

మీ సేవ కేంద్రం మంజూరుకు కృషి చేయాలి

కామారెడ్డి బీబీపేట్,జూలై,20;మండలంలోని మాందాపూర్ గ్రామంలో మీ సేవ కేంద్రం మంజూరు కృషి చేయాలని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ కి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ ,గ్రామ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రోడ్డ రాజు తో కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు, రైతులు, మహిళలు ఆయా సర్టిఫికెట్లు నమోదుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు రాష్ట్ర ప్రభుత్వం యూరియాను యాప్ ద్వారా అందిస్తుందని గ్రామంలో స్మార్ట్ ఫోన్ లేని రైతులు యూరియా నమోదుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి వివరించామన్నారు అనంతరం వార్డ్ సభ్యులు శివనూరి నర్సింలు, రొడ్డ లావణ్య బాబు లతో కలిసి గ్రామంలో పలు వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజీలకు నిధులు కేటాయించాలని వినతి పత్రం అందజేశామన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తక్షణమే స్పందించి మీ సేవా కేంద్రం ఏర్పాటుకు ఆయా అధికారులతో మాట్లాడి గ్రామంలో మీ సేవ కేంద్రం ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. త్వరలోనే సీసీ రోడ్లు డ్రైనేజీలకు కూడా నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెసు నాయకులు శ్యామ్ లాల్, శివ కుమార్, సామేల్ పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper