జనం న్యూస్ సెప్టెంబర్ 17 మమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) కె.గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్రి చిట్టిబాబు ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా ఆర్ఎస్ఎస్ మూలపురుషుడు హెడ్గేవార్, బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాలకు, విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వివిధ వృత్తులకు సంబంధించిన చేతివృత్తి కళాకారులను భారతీయ జనతా పార్టీ నాయకులు కర్రి చిట్టిబాబు, అవసరాల వెంకట రామమూర్తి, గుర్రాల సత్యనారాయణ, సాలాది శేఖర్, సాలాది రామకృష్ణ, కవులూరి వెంకటకృష్ణ, కొప్పిశెట్టి చంద్రరావు, అవసరాల నారాయణమూర్తి, పట్నాల శ్రీనివాస్, దంగేటి మాచర్రావు, దాసరి ముత్యాలు, తాళ్ల ముసలయ్యలు దుశ్శాలువాలు కప్పి పండ్లు పెట్టి సన్మానించారు.