ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు

జనం న్యూస్ సెప్టెంబర్ 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ ముమ్మిడివరం టౌన్ అధ్యక్షులు సన్నిధిరాజు వీరభద్ర శర్మ సూచనల మేరకు జనరల్ సెక్రటరీ కొప్పిశెట్టి బాల వెంకట కిశోర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు, బిస్కెట్లు మరియు చాక్లెట్లు పంపిణీ చేశారు. విద్యార్థులను ప్రోత్సహించడం, విద్య పట్ల ఆసక్తిని పెంపొందించడం మరియు సమాజంలో సేవా భావాన్ని చాటడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు, తట్టవర్తి నాగరాజరావు, ముమ్మిడివరం టౌన్ కమిటీ ఉపాధ్యక్షురాలు శాంతి శ్రీ, కార్యదర్శి బసవ శ్రీ హరిబాబు, మరో కార్యదర్శి కొప్పిశెట్టి వెంకటలక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.

ఇ-పేపర్