తెలంగాణ

మోదీ జన్మదినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన బీజేపి నాయకులు

మోదీ జన్మదినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన బీజేపి నాయకులు

జనం న్యూస్ సెప్టెంబర్ 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భారతమాత ముద్దుబిడ్డ, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా బీజేపీ శాయంపేట మండల అధ్యక్షులు నరహరి శెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాల్లో తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా నరహరిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా మండలంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని తెలిపారు.మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పర్యావరణ పరిరక్షణతోనే భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించగలమని పేర్కొన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సేవాభావాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని రామకృష్ణ తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాయరాకుల మొగిలి, కార్మిక విభాగం జిల్లా కన్వీనర్ ఉప్పు రాజు, జిల్లా కౌన్సిల్ మెంబర్ కానుగుల నాగరాజు, మండల ప్రధాన కార్యదర్శి భూతం తిరుపతి, సీనియర్ నాయకులు బూర ఈశ్వరయ్య, బాసాని విద్యాసాగర్,వనం దేవరాజు, మండల కార్యదర్శి మేకల సుమన్, భూత్ అధ్యక్షులు కోడేపాక సంజీవరావు కన్నెబోయిన రమేష్, బాసాని నవీన్, కొంగర సుధాకర్, కుక్కల సతీష్ తదితరులు పాల్గొన్నారు..

ఇ-పేపర్