తెలంగాణ

మోదీ జన్మదినం సందర్భంగా శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

మోదీ జన్మదినం సందర్భంగా శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

జనం న్యూస్ సెప్టెంబర్ 17 ముమ్మడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకాట్రేనికోన: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా కోనసీమ జిల్లాలో ప్రసిద్ధి చెందిన పార్వతీ కుండలేశ్వర స్వామి ఆలయంలో మరియు క్షేత్రపాలకులు వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కాట్రేనికోన మండల సేవా సంకల్ప్ అభియాన్ కన్వీనర్ పోలవరపు వెంకట సత్యనారాయణ, కో కన్వీనర్ నంద్యాల చంటి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయురారోగ్యాలు, దేశానికి మరింత సేవ చేసే శక్తి కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మట్ట శివకుమార్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి సూర్యనారాయణ గుప్త (నానాజీ), జిల్లా కార్యవర్గ సభ్యులు మట్ట సూరిబాబు, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా ప్రజాసేవతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని, మండలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని నాయకులు తెలిపారు.

ఇ-పేపర్