జనం న్యూస్ సెప్టెంబర్ 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి తోనే నేడు ప్రజాపాలన సాధించుకున్నామని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. గురువారం ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుచ్చిరెడ్డి జాతియ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘనత తెలంగాణ సాయుధ పోరాటానిదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తికి త్యాగాలకు ప్రతీకగా సాధించుకున్న విజయం ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రజాస్వామ్యం అని తెలిపారు. తెలంగాణలో ప్రజా పాలనను బలోపేతం చేస్తూ అభివృద్ధి సంక్షేమ కోసం ఐక్యంగా ముందుకు సాగుదాం అని అన్నారు మండల ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాయంపేట గ్రామ సర్పంచ్ చింతల ఉమా రవిపాల్ నాయకులు , చిందం రవి, కుసుమ శరత్ బాసాని ప్రకాష్ హైదర్ చింతల , లడే రాజ్ కుమార్ మామిడిపల్లి సాంబయ్య శంకరాచారి బూర రమేష్ రాజేందర్, వరదరాజు, కట్టయ్య, , రఫీ, సుదర్శన్ అనిల్ బాసాని మార్కండేయ, పత్తి శీను, దిలీప్ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు….