కాపు ఉద్యమానికి పెద్ద దిక్కును కోల్పోయాం

July 20, 2026 | వైరల్ వార్తలు

ముద్రగడ పద్మనాభం మృతి పట్ల సంతాపం*


జనం న్యూస్ జూలై 20 (ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ)కాట్రేనికోన, కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు జాతి కోల్పోయిందని ఏపీ ఆక్వా రైతు సంఘం కార్యదర్శి త్వపటపల్లి నాగ భూషణం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి విచారకరమన్నారు. కాపు సామాజిక వర్గ అభివృద్ధికి విశేష సేవలు అందించారన్నారు. కిర్లంపూడి ఆయన స్వగృహంలో కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో తూర్పు డెల్టా మాజీ చైర్మన్ యేడిద చక్రపాణి రావు, కాట్రేనికోన మండల తెలుగు రైతు అధ్యక్షుడు సుధా రాఘవేంద్ర, నాయకులు కోటిపల్లి లక్ష్మణ రావు రాయపురెడ్డి చిట్టిబాబు, మానే శ్రీనివాస రావు, కాయాల సూరిబాబు రాయపురెడ్డి జానకి తదితరులున్నారు.

🌐 Select Language:
📰 ePaper