ఊడిముడి వరాహిమాతను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా

July 20, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ జూలై 20 ముమ్మిడివరం ప్రతినిధి ఊడిముడిలో వరాహిమాత పూజల్లో పాల్గొన్న మానేపల్లి అయ్యాజీ వేమా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలోని పి. గన్నవరం మండలం, ఊడిముడి గ్రామంలో జూలై 15 నుంచి తొమ్మిది రోజులపాటు శ్రీ వరాహిమాత అమ్మవారి ప్రత్యేక పూజా మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగు తున్నాయి. ఈ సందర్భంగా జూలై 19న మాజీ శాసనసభ్యులు మానేపల్లి అయ్యాజీ వేమా, జిల్లా ప్రధాన కార్యదర్శిచీకరమెల్లి శ్రీనివాసరావుఅమ్మవారిని దర్శించుకుని, రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, సమాజ సుభిక్షం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి కానుకలు సమర్పించి ఆశీర్వాదాలు పొందారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పి. గన్న వరం మండల అధ్యక్షులు తిక్క సత్యనారాయణ, ఊడిముడి సహకార సంఘం అధ్యక్షులు పెనమారెడ్డి నాయుడు, మాజీ జిల్లా కార్యదర్శి అడ్డాల వెంకటేశ్వరావు, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు పసుపులేటి వెంకటేశ్వరావు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఈ ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నాను

🌐 Select Language:
📰 ePaper