ఛత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమం విజయవంతం – యువత గొంతుకకు కాంగ్రెస్ అండగా ఉంటుంది : బండి రమేష్

July 20, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూలై 20 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ; కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు భారత జాతీయ కాంగ్రెస్ మరియు భారత యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జేఎన్టీయూ ఆడిటోరియంలో నిర్వహించిన ‘ఛత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమం యువత, విద్యార్థుల హోరెత్తించిన నినాదాల మధ్య అత్యంత విజయ వంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ మాట్లాడుతూ, “ఇది యువ భారతం… యువత భవితనే దేశ భవిత” అని పేర్కొన్నారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాల కారణంగా విద్యార్థుల భవిష్యత్తు ఆందోళనకరంగా మారిందని, విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడిందని ఆయన విమర్శించారు. ప్రశ్నాపత్రాల లీకులు, నిరుద్యోగం, ఉన్నత విద్యలో అవకాశాల కొరత వంటి సమస్యలు యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని అన్నారు.ఈ పరిస్థితులపై విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉందని, వారి హక్కుల సాధన కోసం రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని బండి రమేష్ స్పష్టం చేశారు.ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది విద్యార్థులు, యువతీ యువకులు, కాంగ్రెస్ నాయకులు, యువజన నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షులు వినోద్ జాకీర్, రాష్ట్ర అధ్యక్షులు వెంకటస్వామి, బల్మూర్ వెంకట్, తూము వేణు, నాగిరెడ్డి, పుష్ప రెడ్డి, గాలి బాలాజీ, శ్రీనివాస్ బాబు, సాయిబాబా చౌదరి, రంగమోహన్, గంధం రాజు, రాజేష్, శంకర్, పులి శివ గౌడ్, రామారావు, సునీల్, శ్రీకాంత్ పటేల్, మైఖేల్, బాలరాజు, సంధ్య రాణి, జ్యోతి, రమ్య తదితరులు పాల్గొన్నారు.విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఉద్యమిస్తుందని, యువత ఆశయాల సాధనకు ప్రతి అడుగులోనూ అండగా నిలుస్తుందని నాయకులు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

🌐 Select Language:
📰 ePaper