మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టీపీసీసీ రాష్ట్ర నాయకులు

July 20, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ జులై 20 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ; తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవితో కలిసి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) రాష్ట్ర నాయకులు చిరుమర్తి రాజు, రమేష్ గౌడ్ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే అంశాలపై వారు మంత్రితో చర్చించినట్లు సమాచారం. అలాగే కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలిసింది.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, ప్రజలకు చేరువయ్యే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించినట్లు సమావేశంలో పాల్గొన్న నాయకులు తెలిపారు. ఈ మర్యాదపూర్వక భేటీ అనంతరం నాయకులు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాష్ట్ర అభివృద్ధికి ఆయన నాయకత్వంలో మరింత సేవలందించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

🌐 Select Language:
📰 ePaper