ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన వ్యవసాయ అధికారి రాజు

July 20, 2026 | వైరల్ వార్తలు

మద్నూర్ జులై 20 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో పలు ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి రాజు తనిఖీ చేయడం జరిగింది.ఎరువుల యజమానులు వచ్చిన స్టాక్ ఎప్పటికప్పుడు మండల వ్యవసాయ అధికారినీ తెలియజేయాలి , అలాగే వచ్చిన స్టాక్ వివరాలు పెట్టుకోవాలని సూచించడం జరిగింది.ముఖ్యంగా రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన అనగా ఏం ఆర్ పీ ధరలకే ఎరువులు విక్రయించాలని ఆదేశాలివ్వడం జరిగింది.ఎరువుల ధరలు , స్టాక్ వివరాలు లేని పలు ఎరువుల దుకాణాల యజమానులులకు నోటీసులు ఇవ్వడం జరిగింది.రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉన్నది కావున ఫెర్టిలైజర్ ఇంటి నుంచే యాప్ ద్వారా బుక్ చేసుకొని రైతులు తీసుకోవచ్చునని తెలియజేశారు.

🌐 Select Language:
📰 ePaper