మూసాపేట్శ్రీ చిత్తారమ్మ తల్లి ఆలయంలో బోనాల వేడుకలు .ప్రత్యేక పూజల్లో పాల్గొన్న టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్
జ నం న్యూస్ జూలై 21 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఆషాఢమాస బోనాల సందర్భంగా మూసాపేట్‌లోని శ్రీ చిత్తారమ్మ తల్లి దేవాలయంలో బోనాల ఉత్సవాలు భక్తుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సిరిసంపదలు కలగాలని అమ్మవారిని ప్రార్థించారు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ ప్రజల్లో భక్తి భావాన్ని, సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. అమ్మవారి కృపాకటాక్షాలతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, శాంతియుతంగా జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బి-బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, ఆలయ కమిటీ చైర్మన్ తూము శ్రీనివాసరావు, కర్క పెంటయ్య, గురజాల ఎల్లేష్, మల్లేష్ యాదవ్, కలికోట శంకర్, నయీమ్, వాసు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాల ఉత్సవాలకు ప్రత్యేక శోభను తీసుకువచ్చారు.