జహీరాబాద్ నియోజకవర్గంలో విద్యుత్ స్తంభాల వద్ద ప్రజలు ఉండొద్దు – చిట్టెంపల్లి బాలరాజ్
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాల (ఎలక్ట్రికల్ పోల్స్) వద్ద ప్రజలు నిలబడడం, గుమికూడడం లేదా అనవసరంగా సమీపంలో ఉండడం ప్రాణాలకు అత్యంత ప్రమాదకరమని సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ హెచ్చరించారు. వర్షాకాలంలో విద్యుత్ స్తంభాలు, తీగల వద్ద విద్యుత్ లీకేజీ జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు విద్యుత్ స్తంభాల వద్ద ఆడుకోవద్దని, రైతులు వ్యవసాయ పనుల సమయంలో విద్యుత్ లైన్ల సమీపంలో అత్యంత జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నా, తీగలు కిందపడినా వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని, ప్రజల ప్రాణ భద్రతే అందరికీ అత్యంత ముఖ్యమని చిట్టెంపల్లి బాలరాజ్ పేర్కొన్నారు.