‘ ఎస్ ఐ ఆర్ ‘డిజిటలైజేషన్ ప్రక్రియపల్లెల్లో జోరు.. పట్టణంలో నెమ్మదిగా

July 22, 2026 | తెలంగాణ

వందశాతం పూర్తికోసం అధికారుల ప్రయత్నాలు

దశరథ్, తహసీల్దార్, జహీరాబాద్

జనం న్యూస్ 22 జూలై : జహీరాబాద్ నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐ ఆర్) పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియ మండలాల్లో జోరుగా పట్టణాల్లో మందకొడిగా సాగుతోం ది. జహీరాబాద్ నియోజకవర్గంలో బూత్ లెవల్ అధికారు (బీఎల్ ఓ)లు ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేశారు. సర్ ఫారాలను నింపి వాటిని తిరిగి ఇవ్వమన్నారు. ఆగస్టు 3 తేదీ లోపు ఎన్యూమరేషన్ పత్రాలను నింపి ఇవ్వడానికి గడవును పొడిగించారు. కానీ అనేక కారణాల వల్ల పత్రాలు తిరిగి ఇవ్వడం లో జాప్యం చేస్తున్నారు. వందశాతం డిజిటలై జేషన్ కోసం అధికారులు పాట్లు పడుతున్నారు. ప్రతీరోజు ప్రత్యేకంగా దృష్టి పెడుతూ వేగవంతం చేయాలని బీఎల్ ఓలకు చెబుతున్నారు. జహీరాబాద్ నియోజకవర్గం లోని ఐదు మండలాలు రెండు మున్సిపాలి టీలున్నాయి. జహీరాబాద్ మండలంలో 40 బూత్లకుగాను 37,224 ఓటర్లు, ఝరాసం గం మండలంలో 49 బూత్లో 37.363 మం ది ఓటర్లు, న్యాల్కల్ మండలంలో 62 బూత్లో 49,141 మంది, కోహీర్ మండలం లో 44 బూత్లు ఉండగా 37,885 ఓటర్లు ఉన్నారు. కోహీర్ మున్సిపాలిటీలో 11 బూత్ లకు గాను 10,990 మంది, జహీరాబాద్ మున్సిపాలిటీలో 73 బూత్లు ఉండగా 79.742 మంది ఓటర్లు ఉన్నారు. నియోజవ ర్గంలో 2,82,398 మందికి పత్రాలను పం పిణీ చేశారు. వాటిని నింపి ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. సోమవారం వరకు 79.72% పత్రాలను డిజిటలైజేషన్ చేశారు. గ్రామాల్లో మంచి స్పందన వస్తున్నాబూచినెల్లి గ్రామంలో పత్రాలను డిజిటలైజేషన్ చేస్తున్న బీఎల్ ఓలువందశాతం కోసం కృషినియోజకవర్గంలో వందశాతం పత్రాల డిజి టలైజేషన్ కోసం కృషి చేస్తున్నాం. ఫారాలు నింపడంతో పాటు డిజిటలైజేషన్ కోసం హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశాం. పత్రా లను నింపి వెంటనే బీఎల్దలకు ఇవ్వాలని కోరుతున్నాం. జహీరా బాద్, కోహీర్ మున్సిపాలిటీలలో కన్నా మండలాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ బాగుంది. పత్రాలు తీసు కున్న వారు నింపి వెంటనే బీఎల్లకు ఇవ్వాలి. దశరథ్, తహసీల్దార్, జహీరాబాద్ పట్టణాల్లో మాత్రం నెమ్మదిగా పత్రాలు ఇస్తున్నారు.

🌐 Select Language:
📰 ePaper