రహదారి భద్రత, సామాజిక బాధ్యత ఆటో డ్రైవర్లు విధిగా పాటించాలి

జనం న్యూస్ జూలై 22 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంరహదారి భద్రతతో పాటు సామాజిక బాధ్యతను ఆటో డ్రైవర్లు విధిగా పాటించాలని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు, పట్టణ డిఎస్పి టిఎస్ఆర్ కె ప్రసాద్ పిలుపునిచ్చారు.స్థానిక వాసర్ల గార్డెన్స్‌లో ఆటోరిక్షా డ్రైవర్లతో “బడి పిల్లల భద్రత, బాధ్యత” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిటిఓ, డిఎస్పి పాల్గొన్నారు.డిటిఓ హెచ్చరికఈ సందర్భంగా దేవిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, బడి పిల్లలను తీసుకెళ్లే ఆటో డ్రైవర్లు బాధ్యతాయుతంగా మెలగాలని సూచించారు. లగేజీ స్థానంలో పిల్లలను కూర్చోబెట్టి కేసులు కొనితెచ్చుకోవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే మోటార్ వాహనాల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముమ్మిడివరం, కొత్తపేట, మలికిపురం ప్రాంతాల్లో త్వరలోనే ఇలాంటి అవగాహన సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.డిఎస్పి సూచనడిఎస్పి టిఎస్ఆర్ కె ప్రసాద్ మాట్లాడుతూ, సామాజిక బాధ్యతలో ఆటో డ్రైవర్లు తమ వంతు పాత్ర పోషించాలని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేది ఆటో సేవలేనని పేర్కొన్నారు.సన్మానంగత 25 సంవత్సరాలుగా ఆటో నడుపుతూ ఒక్క రోడ్డు ప్రమాదానికి కూడా ఆస్కారం ఇవ్వకుండా క్రమశిక్షణతో మెలిగిన ఇద్దరు ఆటో డ్రైవర్లను శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ కిషోర్, ఆటో యూనియన్ అధ్యక్షులు వాసంశెట్టి సత్తిరాజు తదితరులు పాల్గొన్నారు