జహీరాబాద్‌కు నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మంజూరు చేయాలని రాష్ట్ర డీజీపీకి వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు *
జనం న్యూస్ 22 -07-2026 సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశంహైదరాబాద్‌లోని రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో గౌరవ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) కు జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు , *సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ , మాజి డిసిఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు .ఈ సందర్భంగా జహీరాబాద్ నియోజకవర్గంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న పట్టణ పరిధి, పరిశ్రమల అభివృద్ధి, విద్యాసంస్థలు, ప్రజా రవాణా వాహనాల రద్దీ కారణంగా ట్రాఫిక్ సమస్య తీవ్రరూపం దాల్చిందని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు.అదేవిధంగా, జహీరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు, ట్రాఫిక్ నియంత్రణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. జహీరాబాద్ ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలించి, త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు రాష్ట్ర డీజీపీ ని విజ్ఞప్తి చేశారు.