నీటి సంరక్షణపై అవగాహన పెంచడమే లక్ష్యం- మున్సిపల్ కమిషనర్ సైదులు

July 23, 2026 | వైరల్ వార్తలు

స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ విద్యార్థులకు నీటి సంరక్షణ-ప్రజా భాగస్వామ్యం పై వ్యాసరచన ,చిత్రలేఖనం పోటీలు

జనం న్యూస్-జులై 23- నాగార్జునసాగర్ టౌన్-భావితరాలకు నీటి ఎద్దడి లేకుండా చూడాలంటే ప్రతి ఒక్కరిలో నీటి సంరక్షణ పై అవగాహన ప్రజాభాగస్వామ్యం అత్యంత అవసరమని మున్సిపల్ కమిషనర్ సిహెచ్ సైదులు పేర్కొన్నారు, నందికొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నీటి సంరక్షణ – ప్రజా భాగస్వామ్యం అనే అంశంపై స్థానిక స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ పాఠశాల విద్యార్థులకు గురువారం వ్యాసరచన చిత్రలేఖన పోటీలు నిర్వహించారు, ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ వర్షపు నీటిని పొదుపు చేయడం నీటి వృధాను అరికట్టడంలో విద్యార్థులు భాగస్వాములై సమాజంలో మార్పు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ బాలాజీ నాయక్ నీటి సంరక్షణ ఆవశ్యకత పై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు, పోటీలలో పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని నీటి సంరక్షణ ఆవశ్యకతను తెలుపుతూ వ్యాసాలు రాయడంతో పాటు ఆకట్టుకునే చిత్రాలను గీశారు.ఈ కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ప్రిన్సిపాల్ ఏ శివకుమార్, కరస్పాండెంట్ కె నకులరావు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper