రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును నిరసిస్తూ నందికొండ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా
కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తూ నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ శ్రేణుల నిరసన
జనం న్యూస్ -జులై 23- నాగార్జునసాగర్ టౌన్-నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి ఆదేశాల మేరకు, టిపిసిసి పిలుపుమేరకు కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను నిరసిస్తూ లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద మాచర్ల- హైదరాబాద్ ప్రధాన రహదారి(ఎన్ హెచ్ 565) పై కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తమ అధినేత రాహుల్ గాంధీ పై జరిగిన దాడి ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదు అని రాజ్యాంగంపై ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని అన్నారు, ప్రజల తరఫున ప్రశ్నించే నాయకుడిని భయపెట్టాలని ఆయన గొంతును అణిచివేయాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఈ సందర్భంగా వారు ఆరోపించారు రాజకీయ విభేదాలను ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎదుర్కోవాల్సిన ప్రభుత్వం దాడులు మరియు కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడటం దేశానికి మంచిది కాదని అన్నారు, దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీకి పెరుగుతున్న ప్రజాదారణ, కాంగ్రెస్ పార్టీకి వస్తున్న అపారమైన ఆదరణను చూసి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం భయపడుతోందని అందుకే ప్రతిపక్ష స్వరాన్ని అణిచివేయాలని ప్రయత్నిస్తుందని కానీ ప్రజాస్వామ్యాన్ని ఎవరు అనగదొక్కలేరని అన్నారు, రానున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డినీ మరొకసారి అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు , కో ఆప్షన్ మెంబర్లు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళ కాంగ్రెస్ నాయకులు,కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.