గినియారుపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఎంపీడీవో మేడం

జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం జులై 23. 07. 2026 జరాసంగం మండలంలోని గినియార్‌పల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలను ఎంపీడీవో మేడం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్య, మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత, మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించి పూల మొక్కలు నాటి ఇనుకుడు గుంతలు మరుగుదొడ్లు లేని వాళ్లకు త్వరలో మంజూరు చేస్తానని గ్రామస్తులకు తెలిపారు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుమ్మరి రాజేశ్వరి గోపాల్, ఏపీవో రాజ్‌కుమార్, టీఎ సమ్మయ్య, ఆర్‌ఐ రుకుముద్దీన్, గ్రామ కార్యదర్శి ఎన్. రాజు, ఫీల్డ్ అసిస్టెంట్, ఉప సర్పంచ్ యాసీన్ అలీ, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.