రవీంద్రసూరికి ప్రతిష్ఠాత్మక సినారె సాహితీ పురస్కారం

July 23, 2026 | తెలంగాణ

జనం న్యూస్ | జూలై 23 | తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డి సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన ప్రముఖ కవి, సినీ దర్శకుడు నామాల రవీంద్రసూరికి 2026 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక డా. సి. నారాయణరెడ్డి (సినారె) స్మారక సాహితీ పురస్కారం ప్రకటించారు. పద్మభూషణ్, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత మహాకవి డా. సి. నారాయణరెడ్డి సాహిత్య స్ఫూర్తిని కొనసాగిస్తూ అందజేస్తున్న ఈ పురస్కారానికి రవీంద్రసూరి ఎంపిక కావడం సాహిత్య వర్గాల్లో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది.మహాకవి సినారె 95వ జయంతి సందర్భంగా ఆగస్టు 2న హైదరాబాద్‌లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సెమినార్ హాల్‌లో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు సినారె కళాపీఠం అధ్యక్షులు మల్లెకేడి రాములు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని సినారె కళాపీఠం, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా స్పందించిన రవీంద్రసూరి, తనను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపిక చేసిన ఎంపిక కమిటీ సభ్యులకు, సినారె కళాపీఠం అధ్యక్షులు మల్లెకేడి రాములకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవాన్ని వ్యక్తిగత విజయంగా కాకుండా తెలుగు సాహిత్యానికి లభించిన గుర్తింపుగా భావిస్తున్నానని పేర్కొన్నారు.రవీంద్రసూరికి సినారె సాహితీ పురస్కారం ప్రకటించడంపై సాహితీవేత్తలు, కళాకారులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు.

🌐 Select Language:
📰 ePaper