మిట్టపల్లి గ్రామంలో కుక్కల దాడిలో మేకలు మృతి బాధిత కుటుంబానికి రూ.20000/- రూపాయలు ఆర్థిక సాయం అందించిన వంగ రాజేశ్వర్ రెడ్డి
జనం న్యూస్ 23-07-2026 “కుక్కల దాడిలో మేకలను కోల్పోయి తీవ్ర నష్టాన్ని చవిచూసిన కుటుంబానికి అండగా నిలిచి, ఆర్థిక భరోసా కల్పించిన వంగ రాజేశ్వర్ రెడ్డిసిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన గాంతి శ్రీను మేకలపై కుక్కలు దాడి చేయడంతో సుమారు 40కు పైగా మేకలు మృతి చెందిన విషాద ఘటనను తెలుసుకున్న వంగ రాజేశ్వర్ రెడ్డి వెంటనే వారి నివాసానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా మేకల మృతితో తీవ్ర ఆర్థిక నష్టం ఎదుర్కొంటున్న కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.20,000 (ఇరవై వేల రూపాయలు) ఆర్థిక సాయం అందజేశారు. ఇలాంటి దురదృష్టకర ఘటనతో కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ధైర్యం కోల్పోవద్దని, ఎల్లప్పుడూ తాము అండగా ఉంటామని వంగ రాజేశ్వర్ రెడ్డి భరోసా కల్పించారు.అనంతరం బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, ఈ ఘటనపైఅనంతరం బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా తగిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.