వివేకానంద విద్యాలయంలో ఘనంగా గోరింటాకు వేడుకలు*
జనం న్యూస్ :23 జూలై గురువారం; సిద్దిపేట నియోజికవర్గం ఇన్చార్జి వై. రమేష్ ;భారత్ నగర్ లోని వివేకానంద విద్యాలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని విద్యార్థినులకు “గోరింటాకు వేడుకలు”నిర్వహించారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను నేటి తరానికి పరిచయం చేయడంలో భాగంగా పాఠశాల యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ వై. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఉన్న సాంప్రదాయ, ఆరోగ్యకరమైన ప్రాముఖ్యతను వివరించారు. వర్షాకాలంలో వచ్చే పలు రకాల చర్మ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుండి గోరింటాకు శరీరానికి రక్షణ కల్పిస్తుందని సైంటిఫిక్ రీజన్ తెలిపారు. మన పూర్వీకులు అందించిన ఇటువంటి ఆచారాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ లిఖిత,ఉపాధ్యాయినిలు రత్నమాల,భాగ్యమ్మ,దివ్యవాణి,ఫిర్దోజ్,రింశ,మానుష,అరుణ,భారతి పాల్గొన్నారు.