గద్వాల జిల్లా కేంద్రంలో మల్లి మొదలైన రోడ్డు విస్తరణ పనులు

July 24, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ 24 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : జోగుళాంబ గద్వాల జిల్లా మున్సిపాలిటీ స్థలాలను కబ్జా చేసి కట్టడాలను కట్టిన వాటిని తొలగిస్తున్న అధికారులు గద్వాల పట్టణంలో గత కొన్ని రోజుల క్రితం కృష్ణవేణి చౌక్ నుంచినది అగ్రహారం వెళ్లే ఇరువైపులా రోడ్డు ను మరియు కృష్ణవేణి చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు కూడా ఇరువైపులా రోడ్డును ఆక్రమించి ఫుట్పాత్ దుకాణాలు ఏర్పాటు చేసిన విషయంలో జిల్లా అధికార యంత్రాంగము మున్సిపల్ అధికారులు మరియు పోలీసుల పర్యవేక్షణలో ఫుట్ పాత్ పై ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగించి మున్సిపాలిటీ ఫుట్ పాత్ స్థలాన్ని కబ్జా చేసిన వాటిని తొలగించి రోడ్డు వెడల్పు చేసిన విషయం విధితమే అయితే జూన్ 23న కృష్ణవేణి చౌక్ నందు గల అయ్యప్ప జిరాక్స్ సెంటర్ నుంచి కొత్త బస్టాండ్ వైపు రోడ్డు వెడల్పు పనులను ప్రారంభించారు అధికారులు. గద్వాల పట్టణములో ఎవరైతే మున్సిపాలిటీ స్థలాలు ఫుట్ పాత్ లను కబ్జాచేసి దుకాణాలు ఏర్పాటు చేసుకొని లేదా ఫుట్ పాత్ లకు ఆక్రమించి ముందుకు వచ్చి కట్టడాలు కట్టిన వాటిని తొలగించడం ప్రారంభించారు. ఇట్టి విషయంపై గద్వాల పట్టణంలో మరోసారి అలజడి మొదలైందని ప్రజలు చర్చించుకుంటున్నారు. మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్రమించి కబ్జా చేసిన వాటిని తొలగించే విషయంలో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా గద్వాల ట్రాఫిక్ పోలీస్ పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేశారు

🌐 Select Language:
📰 ePaper