ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గోడ గడియారాల పంపిణీ

జుక్కల్ జులై 24 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో భాగంగా జుక్కల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారులకు గోడ గడియారాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వం పేద ప్రజలకు గౌరవప్రదమైన గృహాలను అందించడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. గృహ నిర్మాణంతో పాటు లబ్ధిదారులకు అవసరమైన ప్రోత్సాహక కార్యక్రమాలను కూడా ప్రభుత్వం చేపడుతోందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే గోడ గడియారాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు.గోడ గడియారం ప్రతి ఇంటిలో సమయపాలనకు, క్రమశిక్షణకు ప్రతీకగా నిలుస్తుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజలు పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. అధికారులు లబ్ధిదారులతో మాట్లాడి గృహ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న సహాయంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంత ఇంటి కల సాకారమవుతోందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జుక్కల్ ఉప సర్పంచ్ షైక్ ఫిర్దోస్, మాజీ ZPTC, మాజీ సర్పంచ్, సాయగౌడ్, DCC ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్ ఖాన్ వార్డు సభ్యులు,ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ అధికారులు, సిబ్బంది, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.