విత్తనపత్తి రైతులకు వెంటనే పేమెంట్ చెల్లించాలి
జనం న్యూస్ 25 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : జోగుళాంబ గద్వాల జిల్లా రైతులకు పేమెంట్ ఇవ్వకపోతే టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం విలేకరుల సమావేశంలో పాల్గొన్న టిఆర్ఎస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జి గొంగళ్ళ రంజిత్ కుమార్ గద్వాల: నడిగడ్డ ప్రాంతంలో డిసెంబర్ నెలలో ఇచ్చిన పంటకు ఇప్పటి దాకా విత్తనపత్తి రైతులకు ఇవ్వాల్సిన పేమెంట్ ను ఇవ్వకుండా తీవ్ర అన్యాయానికి గురి చేస్తున్నారని,వెంటనే రైతులకు పేమెంట్ చెల్లించి న్యాయం చేయాలని లేనిపక్షంలో తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేపడతామని టిఆర్ఎస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జి గొంగళ్ళ రంజిత్ కుమార్ హెచ్చరించారు. శుక్రవారం గద్వాలలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నడిగడ్డ ప్రాంతంలో వేలాది మంది రైతులు విత్తనపత్తి సాగు చేస్తున్నప్పటికీ డిసెంబర్ నెలలో ఇచ్చిన పంటకు పేమెంట్ చెల్లించకుండగా ఆర్గనైజర్లు కంపెనీలు తీవ్ర నిర్లక్ష్యం చేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ విషయంపై వ్యవసాయ శాఖ అధికారులు మరియు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విత్తన కంపెనీలు, ఆర్గనైజర్లు రైతుల శ్రమను దోపిడీ చేస్తూ కమిషన్‌లు వడ్డీల పేరుతో అన్యాయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దాదాపు 45 వేల ఎకరాలకు పైగా సాగవుతున్న విత్తనపత్తి పంటకు సంబంధించి రైతులకు ఇవ్వాల్సిన పేమెంట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడంతో రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు.ఈ సమస్యపై గతంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు నిర్వహించామని అట్టి విషయాన్ని గుర్తు చేశారు.రైతుల సమస్యలపై వ్యవసాయ కమిషన్, న్యాయస్థానం, జిల్లా కలెక్టర్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా కంపెనీలు, ఆర్గనైజర్ల మొండి వైఖరిలో మార్పులేదని విమర్శించారు.రైతులు పండించిన పంటకు ఇప్పటి వరకు పేమెంట్ ఇవ్వకుండా ఆలస్యం చేయడం అన్యాయమని,రైతుల సమస్యలను పరిష్కరించే వరకు టిఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. రైతులకు వెంటనే బకాయిలు చెల్లించకపోతే తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) పార్టీ ఆధ్వర్యంలో త్వరలోనే ఉద్యమ కార్యాచరణను ప్రకటించి ఆందోళన చేపడతామని ఈ సందర్బంగా వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు లవన్న మీసాల కిష్టన్న అడవిరావులచెర్వు గ్రామ సర్పంచ్ కృష్ణ ఉపసర్పంచ్ గుండన్న మండల నాయకులు గోపాల్ మల్దకల్ మునెప్ప జగదీష్ జమ్మన్న గోవిందు తదితరులు పాల్గొన్నారు.