మహంకాళమ్మ బోనాల పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలి
జనం న్యూస్ జూలై 25 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ; బీబీపేట మండల కేంద్రంలో ఆగస్టు 2 ఆదివారం రోజున జరిగే మహంకాళమ్మ బోనాల పండగ జాతర ను ప్రశాంతంగా జరుపుకోవాలని శుక్రవారం రోజున ఆలయ ప్రాంగణంలో బీబీపేట్ గ్రామ పెద్దలు గుడి కమిటీ సభ్యులు వివిధ కుల సంఘాల సభ్యులు పుర ప్రముఖులు సమావేశమై నిర్ణయించారు. ఇట్టి బోనాల పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉప్పల సాత్విక సాయి, ఉప సర్పంచ్ చందుపట్ల ప్రశాంత్, వివిధ వార్డు సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు, గ్రామ పెద్దలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.