నందికొండ మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల పట్టివేత
జనం న్యూస్ -జులై 25- నాగార్జునసాగర్ టౌన్-నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల బెడదను నివారించేందుకు మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేక పట్టివేత చర్యలు మొదలుపెట్టారు ప్రజారక్షణ మరియు కాలనీవాసుల భద్రతే ధ్యేయంగా కుక్కల పట్టివేత కార్యక్రమం నిర్వహిస్తున్నామని నందికొండ మున్సిపల్ కమిషనర్ సిహెచ్ సైదులు తెలిపారు, నందికొండ మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డులలో వీధి కుక్కల సంచారం ఎక్కువై ప్రజలు, పిల్లలు భయాందోళన చెందుతున్న నేపథ్యంలో నందికొండ మున్సిపల్ చైర్ పర్సన్ స్వర్ణ మానస, వైస్ చైర్మన్ రాజా ప్రసాద్, మరియు వార్డు కౌన్సిలర్ల సమిష్టి నిర్ణయంతో కుక్కల పట్టివేత కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు, కుక్కలను సురక్షితంగా పట్టుకోవడానికి నిపుణులైన బృందాలను రప్పించి మున్సిపల్ సిబ్బందితో కలిసి చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు పట్టుకున్న కుక్కలను జంతు సంరక్షణ నిబంధనల ప్రకారం శస్త్ర చికిత్సలు, వ్యాక్సిన్ల కోసం తరలిస్తున్నామని తెలిపారు. నందికొండ మున్సిపాలిటీ కార్యవర్గం తీసుకున్న ఈ నిర్ణయం పై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే విద్యార్థులు వృద్ధులు సంచరించే ప్రదేశాలలో కుక్కల వల్ల ప్రమాదాలు జరగకుండా అధికారులు ముమ్మరంగా ఈ డ్రైవ్ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.