నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి వ్యతిరేకంగా కొవ్వొత్తుల ర్యాలీ విద్యార్థులకు సంఘీభావం తెలిపిన బండి రమేష్

July 26, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూలై 26 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో న్యాయం కోరుతూ ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు అమానుషంగా లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు ముఖేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజా నుండి ఇందిరా గాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు.ఈ ర్యాలీలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ పాల్గొని విద్యార్థులకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ,నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన అత్యంత దురదృష్టకర ఘటన అని పేర్కొన్నారు. న్యాయం కోసం గళం విప్పిన విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, వారి గొంతును అణచివేయాలనే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సహించబోదని అన్నారు.విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వారి వెంటే నిలుస్తుందని స్పష్టం చేశారు.

🌐 Select Language:
📰 ePaper