28.07.2026 వ తేదీన శ్రీ సౌమ్యనాథ స్వామి కళ్యాణోత్సవ సందర్భంగా నందలూరు టౌన్ లో ట్రాఫిక్ డైవర్షన్

July 27, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా నందలూరు మండలం లో పొత్తపి,చెన్నయ్యగారి పల్లి, లేబాక, ఆడపూరు గ్రామాల వైపు నుండి నందలూరు టౌన్ కు వచ్చే ప్రజలు నందలూరు గుడి వైపు దారిలో రాకుండాఈదరపల్లి,దుర్గాపురం మీదుగా నందలూరు టౌన్ లోకి వెళ్ళవలెను, శ్రీ సౌమ్య నాథ స్వామి కళ్యాణా నికి మరియు దర్శనానికి వచ్చే భక్తులు మాత్రం నందలూరుహరిజనవాడ దగ్గర ఉన్న పార్కింగ్ ప్రదేశంలో వాహనాలు నిలిపి గుడి వద్దకు కాలినడకన వెళ్ళవలెను, అదేవిధంగా నందలూరు వైపు నుండి సౌమ్యనాథ స్వామి దర్శనానికి మరియు కళ్యాణానికి వచ్చుభక్తులునందలూరు షాదిఖానా వద్ద ఉన్న పార్కింగ్ ప్రదేశం లో వాహనాలు నిలుపుకొని సౌమ్యనాథ స్వామి గుడి వద్దకు కాలినడకనరావల సిందిగా ఒంటిమిట్ట సీఐ పి వెంకటేశ్వర్లు, నందలూరు ఎస్.ఐ మల్లికార్జున్ విజ్ఞప్తి చేశారు శ్రీ సౌమ్యనాథ స్వామి కళ్యాణం దృష్టిలో ఉంచుకొని పై విధంగా ట్రాఫిక్ డైవర్షన్ చేయడ మైనది, కావున నందలూరు మండల ప్రజలు, నాయకులు మరియు మీడియా మిత్రులు పోలీస్ వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాము.

🌐 Select Language:
📰 ePaper