మారుతి సుజుకి వరుణ్ మోటార్స్ బాలానగర్‌లో న్యూ బ్రీజా కింగ్ ఆఫ్ ఎస్ యు వి ఎస్ గ్రాండ్ లాంచ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బండి రమేష్

July 27, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ జులై 27 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : బాలానగర్: మారుతి సుజుకి వరుణ్ మోటార్స్, బాలానగర్‌లో నిర్వహించిన *”ది న్యూ బ్రీజా – కింగ్ ఆఫ్ ఎస్ యు వి ఎస్ గ్రాండ్ లాంచ్ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతన మారుతి సుజుకి బ్రీజా కారును ఆవిష్కరించి, షోరూమ్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. భారత ఆటోమొబైల్ రంగంలో మారుతి సుజుకి వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించుకుని నాణ్యమైన సేవలను అందిస్తోందని కొనియాడారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతికత, భద్రతా ప్రమాణాలు, సౌకర్యాలతో రూపొందించిన న్యూ బ్రీజా మార్కెట్లో విశేష ఆదరణ పొందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.సి. రాజు, జీఎం కృష్ణ, ఏజీఎం ఆంజనేయులు, బ్రాంచ్ మేనేజర్ శ్రీనాథ్ రెడ్డి పాల్గొన్నారు.అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు తూము వేణు, పుష్ప రెడ్డి, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, గాలి బాలాజీ, కలికోట బాలరాజు, శివకుమార్, శ్రీకాంత్ పటేల్, గంధం రాజు, మధు, రాము, వాసు, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper