రెండేళ్ల కూటమి పాలన పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజును సన్మానించిన భాజపా నాయకులు

July 27, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ జూలై 27 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ)ముమ్మిడివరం :డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజును భారతీయ జనతా పార్టీ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మేలు చేస్తున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గ సమాచార సాంకేతిక విభాగం కన్వీనర్ గొల కోటి వెంకట రెడ్డి, జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ, జిల్లా కార్యవర్గ సభ్యులు మట్టా సూరిబాబు, రాయపు రెడ్డి భైరవమూర్తి, ముమ్మిడివరం టౌన్ అధ్యక్షులు సన్నిధి రాజు, వీరభద్ర శర్మ, ఐ.పోలవరం మండల అధ్యక్షులు సఖి రెడ్డి శ్రీనివాస్, రామకృష్ణంరాజు, పోలవరపు చంటి, తదితరులు పాల్గొన్నారు.నాయకులందరూ కలిసి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్తామని, కూటమిని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు

🌐 Select Language:
📰 ePaper