రైతులు ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలి
జనం న్యూస్ జులై 27 చిలిపి చెడు మండల ప్రతినిధి : మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం షీలాంపల్లి రైతు వేదికలో సోమవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగాఎల్ -నినో వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఈ ఏడాది తక్కువ వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రభుత్వం హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తమై ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపాలని వ్యవసాయ శాఖ సూచిస్తుంది, చిలిపి చెడు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వైదికలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విత్తనమేలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల ప్రత్యేక అధికారి నిత్యానంద్ పిలుపునిచ్చారు, ఈనెల 27 నుంచి 29 వరకు మూడు రోజులపాటు కొనసాగుతున్న ఈ విత్తనమేలలో ఆరుతడి పంటలకు సంబంధించిన న్యాయమైన, ధృవీకరించిన విత్తనాలను అందుబాటులో ఉంచారు, తక్కువ నీటి లభ్యతతో మెరుగైన దిగుబడులు సాధించేందుకు అవసరమైన మెలుకువలపై మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ గౌడ్ రైతులకు అవగాహన కల్పించారు , ప్రత్యామ్నాయ ఆరుతరి పంటలైన కంది, మినిము , ఆముదం మరియు కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలపడం జరిగిందిఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ నిత్యానంద్ మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ గౌడ్, ఏఈఓ లు వంశి,కృష్ణవేణి రైతులు పాల్గొన్నారు