బిఆర్ఎస్ పార్టీ విచ్చిన్నం చేసే చర్యలు మానుకోవాలి… పిఏసియస్ వైస్ చైర్మన్
జనం న్యూస్ జులై 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంబ్రహ్మ దేవుడు అడ్డొచ్చిన మాజీ స్పీకర్ మధుసూదనచారి ఏమ్మెల్యేగా ఏ పార్టీ నుండి ప్రాతినిద్యం వహిస్తారో చెప్పాలని పిఏసియస్ వైస్ చైర్మన్ ప్రశ్నించారు..? ఈ సందర్బంగా మండలంలోని మైలారం పిఏసియస్ వైస్ చైర్మన్ దూదిపాల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ. భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా భూపాలపల్లి.నియోజకవర్గం యొక్క బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఉంటారు ఆయన నాయకత్వం లోనే బిఆర్ఎస్ పార్టీ యొక్క కార్యచరణ ఉంటుంది అని వేల మంది కార్యకర్తల సాక్షిగా, భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల సాక్షిగా భారత రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేసిన విషయం విధితమే.రాష్ట్రంలో భూపాలపల్లి నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన చేస్తున్న పోరాటానికి ప్రజలు భ్రమరధం పడుతున్న తరుణంలో బిఆర్ఎస్ పార్టీని కార్యకర్తలను విచ్చిన్నం చేస్తూ మాజీ స్పీకర్ మధుసూదనాచారి కుమారుడు నిన్న ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో బ్రహ్మదేవుడు దిగివచ్చినా సరే భూపాలపల్లి నియోజకవర్గం నుండి మధుసూదనాచారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు, జిల్లా తెచ్చిన నాయకుడే ఎమ్మెల్యే అని కాలర్ ఎగరేసి చెప్పాలని కార్యకర్తలకు చెప్పడం ఎంతవరకు సమంజసం అంటూ.ప్రశ్నించారు.మధుసూదన చారి పార్టీ వ్యవస్థాపక వ్యక్తిగా మాకు మీరంటే చాలా అభిమానం, కానీ పార్టీ విధివిధానాలకు కట్టుబడి పని చేయాల్సిన మీరు,రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తో పాటు సమానమైన హోదా శాసనమండలి సభా ప్రతిపక్షనేతగా ఉన్న మీరు భూపాలపల్లి నియోజకవర్గం లో మాత్రం బిఆర్ఎస్ పార్టీని, పార్టీ వర్కర్స్ ను మోసం చేయాలనుకోవడం దేనికి నిదర్శనమో వివరించాలి. భూపాలపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం నిస్వార్థంగా శ్రమిస్తున్న కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర ఆందోళనకు.గురిచేస్తున్నాయి.అధికార కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తున్న ఈ సమయంలో, పార్టీలో అంతర్గత విభేదాలకు తావిచ్చే వ్యాఖ్యలు కార్యకర్తల్లో అయోమయం, నిరుత్సాహాన్ని.కలిగిస్తున్నాయి.మీరు మీ కుమారుడు చేసే వ్యాఖ్యలు, పార్టీ అధిష్ఠానం నిర్ణయాలకు భిన్నమైన సందేశాన్ని కార్యకర్తలకు పంపించే ప్రమాదం ఉంది. అభ్యర్థుల ఎంపిక, పార్టీ భవిష్యత్ వ్యూహాలపై నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం పార్టీ అధినాయకత్వానిదే తప్ప, వ్యక్తిగత ప్రకటనల ద్వారా కార్యకర్తలను అయోమయంలోకి నెట్టడం పార్టీ ప్రయోజనాలకు ఏమాత్రం అనుకూలం కాదు.ఒక రాజకీయ పార్టీలో వ్యక్తుల కంటే పార్టీ సిద్ధాంతం, పార్టీ క్రమశిక్షణ, పార్టీ నిర్ణయాలకే అత్యున్నత ప్రాధాన్యం ఉండాలి. వ్యక్తిగత అభిప్రాయాలు లేదా ఆకాంక్షలు కార్యకర్తల మధ్య విభేదాలు సృష్టించేలా వ్యక్తమైతే, దాని వల్ల లాభపడేది ప్రత్యర్థి పార్టీలే తప్ప బీఆర్ఎస్ కాదు. రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకుల కుటుంబ సభ్యుల నుంచి వచ్చే ప్రతి వ్యాఖ్య కార్యకర్తలపై ప్రభావం చూపుతుందనే విషయాన్ని. గుర్తుంచు కోవాల్సిన అవసరం ఉంది.భూపాలపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలంటే, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త పార్టీ అధిష్ఠానం నిర్ణయాలకు కట్టుబడి పనిచేయాలి. వ్యక్తిగత వర్గాలు, సమాంతర సమావేశాలు, భిన్న సంకేతాలు పార్టీ ఐక్యతను బలహీనపరుస్తాయి. ఇది కార్యకర్తల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, ప్రజల్లో పార్టీపై తప్పుడు సందేశాన్ని తీసుకెళ్లే ప్రమాదం ఉంది.అందువల్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ , పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కేటీఆర్ భూపాలపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితిపై దృష్టి సారించి, పార్టీ శ్రేణులకు స్పష్టమైన మార్గదర్శకత్వం అందించాలని బీఆర్ఎస్ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్ట పడుతున్న నిబద్ధత కలిగిన కార్యకర్తల మనోధైర్యాన్ని కాపాడటం,పార్టీలో ఐక్యతను బలోపేతం చేయడం, అధిష్ఠానం నిర్ణయాలకు విరుద్ధంగా సందిగ్ధత కలిగించే చర్యలను నివారించడం అత్యవసరం.బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ మా విజ్ఞప్తి ఒక్కటే. మన లక్ష్యం వ్యక్తులను గెలిపించడం కాదు, కేసీఆర్.ఆశయాలను, కేటీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ భూపాలపల్లి నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగరవేయడం, కారు గుర్తు విజయానికి కృషి చేయడం.పార్టీ అధిష్ఠానం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తూ, అధికారికంగా నియమించబడిన నియోజకవర్గ ఇన్‌చార్జి గండ్ర వెంకట రమణారెడ్డి నాయకత్వంలో సమిష్టిగా ముందుకు సాగితేనే పార్టీ మరింత బలపడుతుంది కాబట్టి ఆ దిశగా పనిచేద్దామని కోరారు.