ప్రజల ప్రాణాలు తీస్తున్న మద్యం ప్రభుత్వం వెంటనే మద్యాన్ని నిషేధించాలి

July 28, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బి వీరేశం జులై 28. 07. 2026 జహీరాబాద్ నియోజకవర్గంలో జోరుగా సాగుతున్న అక్రమ మద్యం దందాపై సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా విక్రయిస్తున్న మద్యం కారణంగా ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని, యువత ఆరోగ్యం దెబ్బతింటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అక్రమ మద్యం విక్రయాలపై ప్రత్యేక దాడులు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని, అక్రమ మద్యం దందాను పూర్తిగా అరికట్టాలని ఆయన కోరారు.

🌐 Select Language:
📰 ePaper