రైతు నేస్తం 100వ ఎపిసోడ్‌లో ‘ఉత్తమ జిల్లా రైతు పురస్కారం అందుకున్న పి. జగదీశ్వర్ రెడ్డి

July 28, 2026 | తెలంగాణ

జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు జులై 28-07-2026 పెబ్బేర్ రైతు నేస్తం కార్యక్రమం 100వ ఎపిసోడ్ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో, అత్యధిక సార్లు కార్యక్రమానికి హాజరై వ్యవసాయ రంగంపై తనకున్న ఆసక్తి, అంకితభావాన్ని చాటుకున్న పెబ్బేర్‌కు చెందిన రైతు శ్రీ పి. జగదీశ్వర్ రెడ్డికి ఉత్తమ జిల్లా రైతు పురస్కారం ప్రదానం చేశారు.వ్యవసాయంపై నిరంతర అధ్యయనం, ఆధునిక సాగు విధానాల పట్ల ఆసక్తి, రైతు నేస్తం కార్యక్రమంలో చురుకైన భాగస్వామ్యం కారణంగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారం ఆయనకు లభించింది. ఈ సందర్భంగా పలువురు రైతులు, వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు, మిత్రులు జగదీశ్వర్ రెడ్డికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.వ్యవసాయ రంగంలో ఆయన చేస్తున్న కృషి మరెందరో రైతులకు స్ఫూర్తిగా నిలవాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ గౌరవం పెబ్బేర్ ప్రాంత రైతాంగానికి గర్వకారణమని స్థానికులు పేర్కొన్నారు.

🌐 Select Language:
📰 ePaper