సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ
జనం న్యూస్ జూలై 28 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చండూరు గ్రామంలో మంగళవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా చండూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ సోషల్ ఆడిట్ నిర్వహించారు ఈ తనిఖీలు భాగంగా సిఎస్ఎస్ ప్రతినిధి పాఠశాలలోని మౌలిక వసతులు తరగతి గదులు డిజిటల్ ప్యానెల్ ను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది అనంతరం ఆమె పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హెచ్ఎం డి రమేష్ గారితో ఉపాధ్యాయ సిబ్బంది ఏఏపి పాఠశాల కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు సర్పంచ్ శేషాద్రి ఉపసర్పంచ్ మన్నె వెంకటేశం వార్డ్ మెంబర్స్ విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులతో వేరువేరుగా పాఠశాల వసతుల ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది పాఠశాల స్థితిగతులు విద్యార్థుల ప్రమాణాలు పాఠశాల నిధుల గురించి ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడి వివరాలు సేకరించారు పాఠశాలలోని విద్యార్థులతో కూడా వ్యక్తిగతంగా మాట్లాడి వివరాలు సేకరించడం జరిగింది చివరికి ఈ తనిఖీలు భాగంగా సి ఎస్ ఎస్ ప్రతినిధి యొక్క స్పందన సంతృప్తికరంగా ఉన్నదని ఆనందం వ్యక్తం చేశారు