గురుపౌర్ణమి వేళ ఫిలింనగర్ దేవాలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేసిన బండి రమేష్

July 29, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ | జూలై 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డి ; గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ తన సతీమణి, కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లోని ఫిలింనగర్ దేవాలయాన్ని బుధవారం సందర్శించి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించిన బండి రమేష్ దంపతులు రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య నిర్వహించిన పూజా కార్యక్రమాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.అనంతరం బండి రమేష్ మాట్లాడుతూ, గురుపౌర్ణమి భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన పర్వదినమని పేర్కొన్నారు. గురువుల ఆశీస్సులు ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శకంగా నిలుస్తాయని, సమాజంలో సనాతన ధర్మ విలువలు, ఆధ్యాత్మిక చింతనను పెంపొందించే ఇటువంటి పర్వదినాలను ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని పిలుపునిచ్చారు.గురుపౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

🌐 Select Language:
📰 ePaper