భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు భరోసా.. 15వ వార్డులో కౌన్సిలర్ అరిగెల అనూష-రాకేష్ క్షేత్రస్థాయి పర్యటన

July 29, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్, జులై 29, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణంలో ఈ రోజు కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు 15వ వార్డు కౌన్సిలర్ అరిగెల అనూష-రాకేష్ క్షేత్రస్థాయిలో పర్యటించారు.ముఖ్యంగా తాత్కాలిక షెడ్లు, పాత ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాలను స్వయంగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాత ఇళ్లలోని కప్పుల పరిస్థితిని పరిశీలిస్తూ, వర్షపు నీరు ఇంట్లోకి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఆదేశించామని తెలిపారు. పాత ఇళ్లలో నివసించే వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, నీరు నిలిచిన ప్రాంతాల్లో అనవసరంగా సంచరించవద్దని సూచించారు.వర్షాల కారణంగా ఎలాంటి సమస్యలు ఎదురైనా ప్రజలు తనను ఎప్పుడైనా సంప్రదించవచ్చని, 24 గంటలు అందుబాటులో ఉంటానని కౌన్సిలర్ హామీ ఇచ్చారు.ఈ పర్యటనలో వార్డు ప్రజలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper