కన్నుల పండుగల షిరిడి సాయి సత్యవ్రతం
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు జులై 28-07-2026 ఆషాఢ శుక్ల పక్షం శుద్ధ పూర్ణిమ, వ్యాస పూర్ణిమ(గురు పౌర్ణమి) పురస్కరించుకొని పెబ్బేరు శ్రీ శ్రీ శ్రీ షిరిడి సాయి ఆలయంలో సాయి సేవా సమితి ఆధ్వర్యంలో సాముహిక సాయి సత్య వ్రతం వైభవంగా నిర్వహించారు. బుధవారం ఉదయం కాగడా హారతి సాయినాథునికి అభిషేకం , గణపతి పూజ, నవగ్రహ పూజ, సాముహిక సాయి సత్య వ్రతం వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారి మీదివేముల గురురాజాచార్యులు, నవీనాచార్యులు మాట్లాడుతూ గురు పౌర్ణమి అనేది భారతీయ సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైనది పర్వదినం ఆషాడం మాస పౌర్ణమి రోజున ఎ మహోత్సవాన్ని జరుపుకుంటే చాలా మంచి జరుగుతుందని తెలిపారు ఈ రోజున మానవులకి జ్ఞానం సంస్కారం ధర్మం ఆధ్యాత్మిక మగాన్ని చూపిస్తుందని తెలియజేశారు మహర్షి వేద వ్యాసుడు ఈ రోజున అవతరించారని విశ్వాసం ఆయన వేదాలను నాలుగు భాగాలుగా విభజించి మహాభారతం, 18 పురాణాలు బ్రహ్మ సూత్రాలు వంటి మహా గ్రంథాలను రచించి ప్రపంచానికి అమూల్యమైన జ్ఞానాన్ని అందించారని తెలిపారు. అందువల్ల ఈరోజును గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి గా పిలువ బడతాయని అన్నారు. శిరిడి సాయిబాబ తన జీవితమంతా గురు సేవ చేసిన సాంప్రదాయాన్ని తన శిష్యులకు కూడా పాటించాలని షిరిడీలో బాబ తన భక్తులకు బోధించినట్లు వారు వివరించారు. గురువు పూజించడానికి వ్యాసుని జయంతి అయినా వ్యాస పూర్ణమ ను మించిన రోజు లేదని బాబా భావించే వారిని ఆరోజునే గురుపూర్ణిమి గా నిర్ణయించారని వారు భక్తులకు బోధించారు. కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయి సేవా సమితి సభ్యులు ధరూర్ శ్రీనివాసులు, హనుమంతు రెడ్డి, రాజశేఖర్, శ్రీనివాసరెడ్డి, ఎల్లయ్య, శ్రీధర్ గుప్తా, బాలరాజు, వెంకట్రామిరెడ్డి, విజయ్, శ్రీనాథ్, కిషోర్, నాగరాజ్, బసాల వెంకటేశ్వర్ రెడ్డి, రమేష్, ఫోటో అంజి, రమేష్ ఆచారీ, శివ, విష్ణు, నవీన్, ప్రేమ్, మణిసాయి తదితరులు పాల్గొన్నారు.